ETV Bharat / city

జగమెరిగిన ఇంద్రజాలికుడు... మన విశాఖ యువకుడు! - vizag latest news

ఇంద్రజాలంలో ఆరితేరాడు ఆ యువకుడు. మనిషిని గాలిలో తేల్చడం అతని ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఆరు వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చాడు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల్ని సైతం మెప్పించాడు. అంతర్జాతీయ అవార్డులను అలవోకగా సాధించాడు. ఇదంతా విశాఖ యువకుడు బీఎస్ రెడ్డి.

magician bs reddy
magician bs reddy
author img

By

Published : Sep 30, 2020, 7:14 PM IST

విశాఖ యువకుడి ప్రతిభకు ప్రపంచమే ఫిదా!

బీఎస్ రెడ్డి... ఈ పేరుకు ఇంద్రజాల ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. విశాఖకు చెందిన ఈ యువకుడి ప్రతిభకు ప్రపంచమే ఫిదా అయింది. ఎన్నో అవార్డులు దాసోహం అన్నాయి. ఇతను పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు సరదాగా ప్రారంభించిన మేజిక్... మన దేశానికే పేరు తెచ్చే స్థాయికి వెళ్లింది. ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ డేవిడ్ కాపర్ ఫీల్డ్ స్ఫూర్తితో ఇంద్రజాలం నేర్చుకున్న బీఎస్ రెడ్డి.... అతని మెప్పును సైతం అందుకునే స్థాయికి చేరుకున్నాడు.

ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శన

మనిషిని గాలిలో తేల్చే మాయలో దేశంలోనే బీఎస్ రెడ్డికి ప్రత్యేకస్థానం ఉంది. అత్యంత సహజ సిద్ధంగా ఉండే ఇల్యుజన్ ప్రక్రియ మన బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రముఖులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక టీవీ కార్యక్రమంలో బాలీవుడ్ నటి మలైకా అరోరాను గాలిలో తేల్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు బీఎస్ రెడ్డి.

ఆ ప్రదర్శన తరువాత ప్రపంచంలోనే మ్యాజిక్​కు అత్యున్నత, ప్రతిష్టాత్మక వేదికగా భావించే 'పెన్ అండ్ టెల్లర్ ఫూల్ అజ్' రియాలిటీ షోకి అవకాశం దక్కించుకున్నాడు. మన దేశం నుంచి ఈ ప్రదర్శనకు అర్హత సాధించిన ఏకైక మెజీషియన్ ఇతనే. ఆల్ ఇండియా మేజిక్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాదుగర్ ఆనంద్... బీఎస్ రెడ్డిని క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ మేజిక్ అవార్డుతో సత్కరించారు.

అంతర్జాతీయ అవార్డు

తొమ్మిదేళ్ల వయస్సు నుంచి మెజీషియన్​గా అడుగులు ప్రారంభించిన బీఎస్ రెడ్డి ముప్పై ఏళ్ల అనుభవంలో 6,500 ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్​లాండ్ ఇలా సుమారు 20 వరకు దేశాల్లో ప్రజలను తన మాయాజాలంతో మంత్రముగ్ధులను చేశాడు.

అమెరికాలోని ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ నుంచి అత్యున్నత 'ఆస్కార్ ఆఫ్ మేజిక్' అవార్డు సైతం మన విశాఖ మెజీషియన్​ను వరించింది. రాజకీయ, విద్యారంగానికి చెందిన ఆస్ట్రేలియాలోని ఇండియన్ కల్చరల్ ఆర్గనైజేషన్ బీఎస్ రెడ్డి పేరును కళా రంగంలో పద్మశ్రీ అవార్డు కోసం నామినేట్ చేసింది.

యువతకు సాయం

మ్యాజిక్ నేర్చుకోవాలనుకునే యువతకు తన వంతు సాయం చేస్తున్నట్లు బీఎస్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో ఉన్న ఏకైక మ్యాజిక్ అకాడమీని నిర్వహిస్తున్న బీఎస్ రెడ్డి... దీని ద్వారా ఎంతో మంది యువ మెజీషియన్లను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. వినోదాన్ని పంచుతూ ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకట్టుకునే ఇంద్ర జాలంలో యువత రాణిస్తే మంచి భవిష్యత్తును సొంతం చేసుకోగలరని అంటున్నారు బీఎస్ రెడ్డి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.