మూడున్నర దశాబ్ధాల పాటు సేవలందించిన ఐ.ఎన్.ఎస్.రంజిత్‌కి నౌకాదళం వీడ్కోలు పలికింది. అత్యంత సమర్ధవంతంగా సేవలందించిన ఈ నౌక ఎన్నో కీలక సమయాల్లో సామర్ధ్యాన్ని ప్రదర్శించి ఘనత చాటుకుందని నౌకాదళ అధికారులు ప్రశంసించారు. విశాఖపట్నం కేంద్రమైన తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో జరిగిన వీడ్కోలు సమావేశానికి అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. 16 మంది అధికారులు, 10 మంది నావికులు, 23 మంది కమాండింగ్ అధికారులు ఈ నౌకకు వీడ్కోలు పలికారు. 1983లో రష్యాలో తయారైన ఈ నౌక... కమిషన్ నాటికి విష్ణు భగవత్ సారథ్యం వహించారు. వీడ్కోలు సమయంలో కెప్టెన్ విక్రమ్ సి.మెహ్రా కమాండింగ్ అధికారిగా ఉన్నారు.
2190 రోజుల్లో 7 లక్షల 43 వేల నాటికల్ మైళ్ళు పయనించి రికార్డ్ సృష్టించినది. ఇది ప్రపంచాన్ని 35 సార్లు చుట్టి వచ్చింది. అంటే భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని లెక్కవేసినప్పుడు... మూడున్నర రెట్లు ఎక్కువతో సమానం. తూర్పు, పశ్చిమ నౌకాదళాలు నిర్వహించిన పలు కీలక ఆపరేషన్స్‌లో రంజిత్ పాల్గొంది. సునామీ, హుద్‌హుద్ విపత్కార సమయాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే పలు అవార్డులు పొందింది.
ఇదీ చదవండీ :