ఇదీచదవండి
'ఉల్లి ధరలు ఇలా ఉంటే...కొనేదెలా ? తినేదెలా ?'
విశాఖ జిల్లాలో ఉల్లి ధరలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో నలబై రూపాయలు పెరిగి..వినియోగదారులకు ఘాటెక్కిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉల్లి వెతలు మిగిలిస్తున్నాయి. పండుగ వేళ ఇబ్బంది పెట్టేలా ధరలు మండిపోతున్నాయి. 70 నుంచి 80 రూపాయలు ఉన్న ఉల్లిని కొనేదెలా ? తినేదెలా ? అంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే...కొనుగోళ్లు తగ్గిపోయాయని అమ్మకందారులు వాపోతున్నారు.
ఉల్లి ధరలు ఇలా ఉంటే...కొనేదెలా ? తినేదెలా ?
ఇదీచదవండి