ETV Bharat / city

కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేయాలని కోరా: మంత్రి ముత్తంశెట్టి

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక మంత్రుల సదస్సు బెంగళూరులో జరిగింది. ఆ సదస్సులో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మంత్రి ముత్తంశెట్టి
మంత్రి ముత్తంశెట్టి
author img

By

Published : Oct 29, 2021, 11:04 PM IST

రాష్ట్రంలో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేయాలని కోరుతూ.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా ప్రతిపాదనలు ఇచ్చినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక మంత్రుల సదస్సు బెంగళూరులో జరిగింది. ఆ సదస్సులో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే కిషన్ రెడ్డికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు ముత్తంశెట్టి తెలిపారు.

తూర్పు కనుమలు, విశాలమైన సముద్ర తీరం, ప్రసిద్ద జీవనదులు, సుప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, పర్యావరణ కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నాయని.. వీటి అభివృద్దికి కేంద్రం సహాయం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే.. రాష్ట్ర ప్రభుత్వం పలుచర్యలు తీసుకుందని తెలిపారు. వాటికి కేంద్రం వివిధ పథకాల ద్వారా నిధులు విడుదల చేయాలని కోరారు. క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టును విశాఖ నుంచి శ్రీలంక వరకు రూ. రెండు వందల కోట్ల వ్యయంతోనూ, రాష్ట్రంలో నదీ పర్యాటకం కూడా మరో రూ. రెండు వందల కోట్లతో ప్రతిపాదనలు పరిశీలించాలని కిషన్ రెడ్డిని కోరారు.

విశాఖ నుంచి ఆరకు వరకు మరిన్ని అద్దాల బోగీలను సమకూర్చేందుకు 30 కోట్ల రూపాయలు, గిరిజన ప్రాంతాలలో యాత్రికుల నివాసాల నిర్మాణానికి 200 కోట్లను, గండికోట, భవానీ ద్వీపం, అనంతగిరి, ఆరకు ప్రాంతాలలో రోప్ వే ప్రాజెక్టుల కోసం 200 కోట్లను, సముద్ర తీర ప్రాంతాన్ని కలిపే రహదారి నిర్మాణానికి 600 కోట్లు... మొత్తం రూ.రెండు వేల కోట్లతో పర్యాటక రంగ అభివృద్ది ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: TDP ON CM JAGAN: ప్రతిపక్షాల్ని భయపెట్టడం.. డ్రగ్స్ సమస్యకు పరిష్కారం కాదు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.