ETV Bharat / city

Dump At AOB: ఏవోబీ సరిహద్దులో భారీ డంప్‌.. పేలుడు సామగ్రి, యంత్రాలు స్వాధీనం - aob

ఏవోబీ సరిహద్దులో భారీ డంప్‌
ఏవోబీ సరిహద్దులో భారీ డంప్‌
author img

By

Published : Dec 25, 2021, 1:29 PM IST

Updated : Dec 25, 2021, 2:01 PM IST

13:26 December 25

huge dump on the AOB

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో.. ఒడిశా మ‌ల్క‌న్‌గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్, ఏరియా డామినేష‌న్ నిర్వ‌హించగా భారీ డంప్ బయటపడింది. ఈ డంప్‌లో పేలుడు సామగ్రి, యంత్రాలు ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డంప్‌లో ఒక జనరేటర్, కోడెక్స్ తీగ, ఆరు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ తీగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోడెక్స్ వైర్ బ్లాస్టింగ్ శ‌క్తిని పెంచుతుంద‌న్నారు. ఈ డంప్ ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ క్యాడ‌ర్‌కు చెందిన‌విగా అనుమానిస్తున్న‌ట్లు తెలిపారు. పౌరులు, పోలీసులు ల‌క్ష్యంగా దాడులు చేసేందుకు ఈ ఆయుధాలను దాచినట్లు అనుమానిస్తున్న‌ామన్నారు. ఈ ప్రాంతంలో అదన‌పు బ‌ల‌గాల‌ సహాయంతో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 25, 2021, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.