ETV Bharat / city

ఆదివాసీల అడ్డాలో.. స్వాత్మానందేంద్ర హిందూ ధర్మ ప్రచార యాత్ర - పడువాలో కొనసాగిన హిందూధర్మ ప్రచార యాత్ర

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి.. ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. హిందూధర్మ ప్రచార యాత్రలో భాగంగా.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని కోరాపుట్​ జిల్లా పాడువాలో ఆయన పర్యటించారు. అనంతరం అరకులోని కాఫీ మ్యూజియంను సందర్శించి.. ఆదివాసీల ఆదాయ వనరుల పెంపు ప్రణాళికను ప్రశంసించారు.

swatmanandendra in aob, hindu dharma prachara yatra went to paduva
ఏవోబీలో హిందూధర్మ ప్రచార యాత్ర, పాడువాలో పర్యటించిన స్వాత్మానందేంద్ర
author img

By

Published : Mar 26, 2021, 10:35 PM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని కోరాపుట్ జిల్లా పాడువాలో హిందూ ధర్మ ప్రచారయాత్ర కొనసాగింది. హిందూత్వం మతం కాదని, భారతీయుల జీవన విధానమని.. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. హైందవ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మానవ జీవితం సార్థకమవుతుందని స్పష్టం చేశారు. అన్యమతస్థుల ప్రలోభాలకు లొంగి.. తల్లిలాంటి హిందూ మతాన్ని వదిలిపెట్టవద్దని ఆదివాసీలకు సూచించారు.

విశాఖ శ్రీ శారదాపీఠం తరపున ఆదివాసీ మహిళలకు స్వాత్మానందేంద్ర స్వామీజీ చీరలు పంపిణీ చేశారు. తరిగొండ వెంగమాంబ భజన బృందాలు ఆయనకు స్వాగతం పలికాయి. తమ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ ఆదివాసీలు వారిని గ్రామంలోకి తీసుకువెళ్లారు. సీతారామ మందిరాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ మతం పట్ల గ్రామస్థులు చాటుతున్న అంకితభావాన్ని అభినందించారు.

కాఫీ మ్యూజియం సందర్శన..

అనంతరం అరకులోయలోని కాఫీ మ్యూజియంను స్వామీజీ సందర్శించారు. విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటల ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలు వాణిజ్య పంటలను పండించి, ఆదాయ వనరులను పెంచుకోవడం అభినందనీయమన్నారు. స్వాత్మానందేంద్ర స్వామి వెంట స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీ మాధవి భర్త శివ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:

గ్యాస్ లీక్​తో చెలరేగిన మంటలు.. రెండు దుకాణాలు దగ్ధం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.