విశాఖలో సినీనటుడు రామ్ చరణ్ సందడి చేశారు. ఆచార్య సినిమా విజయోత్సవ సభలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం రామ్ చరణ్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమ అభిమాన నటుడిని చూడటానికి భారీగా మెగా అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్‌పై పూల వర్షం కురిపించారు. జై చరణ్ అంటూ పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి విజయోత్సవ సభ వేదిక వద్దకు అభిమానులతో కలిసి రామ్ చరణ్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
మెగా హీరోలు కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆచార్య". భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కథ బాగానే ఉన్న కథనం కొత్తగా లేదని, కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.34.65 కోట్ల షేర్‌ను సాధించింది.
ఇదీ చదవండి: ''సర్కారు వారి పాట'లు అదుర్స్'.. 'ఆచార్య' కామెడీ ప్రోమో రిలీజ్