ETV Bharat / city

ఉత్తరాంధ్ర రైతులపై పంజా విసిరిన నివర్‌ తుపాన్‌

author img

By

Published : Nov 29, 2020, 5:48 AM IST

నివర్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ప్రభావం చూపకపోయినప్పటికీ... రైతులకు నష్టాలు అయితే తప్పలేదు. భీకర వర్షాలు లేకపోయినప్పటికీ.. గాలుల తీవ్రత రైతుల పాలిట శాపంగా మారింది. చేతికొచ్చిన పంట నెలపాలైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు వల్ల చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు తుపానులు రావచ్చనే హెచ్చరికల నేపథ్యంలో... రైతులతో పాటు సామాన్య ప్రజలూ భయాందోళనకు గురవుతున్నారు.

Heavy Crop Loss In North Andhra over Niver Storm
ఉత్తరాంధ్ర రైతులపై పంజా విసిరిన నివర్‌ తుపాన్‌
ఉత్తరాంధ్ర రైతులపై పంజా విసిరిన నివర్‌ తుపాన్‌

నివర్‌ తుపాన్‌...ఉత్తరాంధ్ర జిల్లాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ... రైతులపై మాత్రం పంజా విసిరింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వరి కోతలకు రైతులు సిద్ధమవుతారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్‌ల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం అన్న తేడా లేకుండా ద్వీపకల్ప భాగంలో ఏదొక ప్రాంతం తుపాన్ల ప్రభావానికి గురవుతూనే ఉంటుంది. ఫలితంగా... కోస్తా జిల్లాలకు ఎప్పుడూ ఈ కాలం సవాళ్లు విసురుతూనే ఉంటుంది. ఈసారి నివర్ తుపాన్‌ వంతు వచ్చింది. పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ... పంట నష్టం భారీగానే జరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. సీజన్‌ చివరిలో అకాలవర్షాలు ముంచేశాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తున్న తుపాన్లు అన్నదాతలను వణికిస్తున్నాయి. రెక్కల కష్టం ఇంటికొచ్చే వేళ.. కలవరానికి గురిచేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే దాదాపు 30 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. కోతలు కోసి చేతికొచ్చిన ధాన్యం రాశులు దాచుకోలేని దయనీయ స్థితి. పోనీ కొనుగోలు కేంద్రాలైనా తెరిచారా..? అంటే అదీ లేదు. నిబంధనల కొర్రీలతో వాటి ఏర్పాటులో ఇంకా అలసత్వం వహిస్తున్నారు అధికారులు. గిట్టుబాటు ధర వచ్చేదాకా ఉంచలేక, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోలేక రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆర్జీఎల్ వంటి తేలిక రకం ధాన్యం 15 రోజుల ముందుగానే చేతికొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా నూర్పిడి పూర్తి చేసిన రైతులు.. ఇప్పుడు వాటిని అమ్మేందుకు అవస్థలు పడుతున్నారు. నివర్‌ తుపాను ప్రభావంతో ఏకధాటిగా జల్లులు పడ్డాయి. ఫలితంగా పొలాల్లోకి నీరు చేరింది. ఈనెల ఆరంభంలో అల్పపీడన ప్రభావంతో వర్షం కురవగా.. వారం రోజులకుపైగా వరిపంట నీటిలోనే నానిపోయింది. వర్షాలకు వరికుప్పలతో పాటు కోతకోసిన పంట తడిచి పోయింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగుపై పెట్టుకున్న అశలన్నీ ఆవిరి అవుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

నివర్ తుపాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలోని 13 మండలాల్లో 2,286 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఇందులో అత్యధికంగా శృంగవరపుకోట మండలంలో 624హెక్టార్లు, లక్కవరపుకోట మండలంలో 500హెక్టార్లు, జామిలో 420, వేపాడలో 350, కొత్తవలస మండలంలో 132 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన పంట కొంతమేర నేలవాలిపోగా... కోతలు పూర్తియిన పంట నీటమునిగింది. ప్రభుత్వం ఆదుకోకపోతే... నష్టాల నుంచి గట్టెక్కలేమని అన్నదాతలు వాపోతున్నారు.

విశాఖ జిల్లాలో మొత్తం 10 వేల హెక్టార్లలో వరి నీట ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనా. త్వరగా వర్షపునీరు పొలం నుంచి బయటపడేయాలన్న తమ ప్రార్థనకు వరుణుడు కరుణిస్తే తక్కువ నష్టంతో బయటపడతామన్నది రైతన్నల ఆవేదన. లేదంటే ధాన్యం రంగు మారిపోయి ధర కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. మొత్తం 24 మండలాల్లో ఈ పంట నష్టం కానొస్తోంది. బుచ్చయ్యపేట, చీడికాడ, చోడవరం, మునగపాక మండలాల్లో వరి నేలకు ఒరిగింది. ఏజెన్సీ మండలాల్లో ముంపు లేకపోయినా, పెరిగిన గాలులు వరి కంకులను నేలవాలుస్తున్నాయి. వందల ఎకరాల్లో ఉద్యాన పంటలను దెబ్బతిన్నట్టు ఆశాఖ లెక్కలను తేల్చే పనిలో నిమగ్నమైంది. ప్రధానంగా జామ, బత్తాయి, సపోటా, దానిమ్మ, వంటి పండ్ల తోటలు, కూరగాయల తోటలకు, ఆకుకూరలకు నష్టం వాటిల్లింది.

వరుస తుపాన్‌ హెచ్చరికలు రైతులను సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ముందస్తుగా కోతలను ఆరంభించాలని చూసినప్పటికీ... నివర్‌ ముందుకు సాగనీయలేదు. ఫలితంగా ఈసారీ పంట నష్టం కొన్ని మండలాల్లో తప్పనిసరైంది. పంటలకు పూర్తిస్థాయి బీమాలు జరగకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం.. పంట కొనుగోళ్లలో రైతు పక్షపాతిగా వ్యవహరించాలని ఉత్తరాంధ్ర రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.