ETV Bharat / city

సగంలో నిలిచిన ఉద్యానవనం... అసంపూర్తిగా యాంపీ థియేటర్

author img

By

Published : Dec 8, 2020, 11:13 AM IST

విశాఖ నగర శివారు ప్రాంతాల్లో రూ.1.14కోట్లతో నిర్మించ తలపెట్టిన సత్యానగర్ ఉద్యానవన పనులు మధ్యలో ఆగిపోగా....యాంపీ థియేటర్ పనులు కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయి.

Incomplete Amphitheater
అసంపూర్తిగా యాంపీ థియేటర్

విశాఖ నగర శివారు ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదం అందనంత దూరంలో ఉంటోంది. దీనికి ఉదాహరణ చినముషిడివాడ సత్యానగర్‌లో రూ.1.14కోట్లతో చేపట్టిన ఉద్యానవనం.. ఇది ప్రస్తుతం సగంలోనే నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఎకరం స్థలంలో ఇక్కడ అత్యాధునిక వసతులతో ఉద్యానవనం నిర్మాణం చేపట్టారు.. రెండేళ్లయినా సగం పనులు కూడా పూర్తికాలేదు.. గుత్తేదారుకు జీవీఎంసీ నిధులు విడుదల చేయకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని కాలనీవాసులు వాపోతున్నారు.

చిన్నారులు, యువత, వృద్ధులు, మహిళలు ఇలా... అన్ని వర్గాల వారికి ఈ ఉద్యానవనంలో సదుపాయాలు కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీన్ని ఒక నమూనా పార్కుగా తీర్చిదిద్దాలని భావించి నిర్మాణం ప్రారంభించారు. పార్కు స్థలానికి ప్రహరీ పూర్తి చేశారు. యాంపీ థియేటర్‌ ప్రాథమిక దశ పూర్తయింది. బహిరంగ వేదిక ఎదుట అర్ధ చంద్రాకారంలో స్టెప్స్‌ తరహాలో సందర్శకులు కూర్చునేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు. పార్కుకు మూడు వైపులా లాంజ్‌ల ఏర్పాటుకు ప్రాథమిక పనులు పూర్తయ్యాయి.

ఆకతాయిలకు అడ్డాగా..

వైకాపా ప్రభుత్వం రావడంతో ఉద్యానవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రెండేళ్లవుతున్నా దీని గురించి పట్టించుకున్న వారు లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డాగా మారింది. సాయంత్రం వేళ పలువురు ఇక్కడికి వచ్చి మద్యం తాగుతున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికే సగం పూర్తయిన నిర్మాణాలు పాడైపోయే స్థితికి చేరుకున్నాయని వాపోతున్నారు. పనులు మాత్రం ముందుకు సాగకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం...

నిధులు లేకపోవడం వల్లే సత్యానగర్‌లో పార్కు నిలిచిపోయింది. ఈ విషయం జీవీఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తిచేయాలని గుత్తేదారును కోరుతాం.

- మెహర్‌బాబా, ఈఈ, జీవీఎంసీ ఉద్యాన విభాగం

పార్కులో ప్రతిపాదించిన సదుపాయాలు

  • యాంపీ థియేటర్‌
  • ఫిట్‌నెస్‌ స్టేషన్‌
  • యోగా స్టేషన్‌
  • తాగునీరు, మరుగుదొడ్లు
  • సేదతీరేందుకు ప్లాజాలు
  • యువతకు ప్లేకోర్ట్‌
  • చిల్డ్రన్‌ ప్లే ఏరియా
  • అనుసంధాన నడక దారులు
  • ఉదయపు నడక కోసం వాకింగ్‌ ట్రాక్‌
  • పెద్దలు కూర్చునేందుకు బెంచీలు
  • పార్కు అంతటా పచ్చిక బయలు
  • ఉద్యానవనం నలువైపులా అలంకరణ మొక్కలు

ఇదీ చదవండి:

'చందా వేద్దాం.. కళ్లు తెరిపిద్దాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.