బకాయి పడిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ మునిసిపాలిటీ మలేరియా విభాగం కార్మికులు ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో శక్తివంచన లేకుండా పని చేసినా.. వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన జీతాలు విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ.. జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండి: