పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వెల్లడించే క్యాలెండర్‌ను గ్రీన్ క్లైమేట్ బృందం రూపొందించింది. విశాఖ పౌర గ్రంథాలయంలో ఈ క్యాలెండర్‌ను పర్యావరణ కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికుల సమక్షంలో ఆవిష్కరించారు.
భూగోళం మీద ఉన్న జీవావరణం కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్న సందర్భంలో సంవత్సరంలోని పర్యావరణ పరిరక్షణ దినాలను గుర్తించే విధంగా ఈ క్యాలెండర్ రూపుదిద్దారు. ప్రధానంగా అంతర్జాతీయ పర్యావరణ దినం, ప్రపంచ వన్యప్రాణుల దినం, అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ, జాతీయ కాలుష్య నియంత్రణ దినం, వంటి అనేక పర్యావరణ పరిరక్షణ దినాలను ఇందులో పొందుపరిచారు. వీటిని అందరు గుర్తించే విధంగా ఈ క్యాలెండర్‌ను తీర్చిదిద్దినట్టు గ్రీన్ క్లైమేట్ బృందం ప్రతినిధులు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర ఆచార్యురాలు సిహెచ్ హేమలత, ఏఎస్ రాజా కళాశాల జంతుశాస్త్ర జూనియర్ లెక్చరర్ కె.వి విజయ్ కుమార్, గ్రీన్ క్లైమేట్ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సేవే మార్గం.. గిన్నిస్‌బుక్‌లో స్థానం