విశాఖపట్నం పోర్టును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందర్శించారు. పోర్ట్ చైర్మన్ రింకేశ్ రాయ్, డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరినాథ్... గవర్నర్కు స్వాగతం పలికారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది గవర్నర్కు గౌరవ వందనం సమర్పిచంచారు. గవర్నర్ క్రూజ్లాంచ్లో పర్యటించి పోర్ట్ కార్యకలాపాలు పరిశీలించారు. పోర్ట్వ్యాపార కార్యకలాపాలు ఎగుమతులు దిగుమతులు మౌలిక వసతులు వంటి అంశాలను పోర్ట్ ఛైర్మన్ గవర్నర్కు వివరించారు. పోర్ట్లో జరుగుతున్న వ్యాపార అభివృద్ధి కార్యకలాపాలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన ముగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్.. విజయవాడ చేరుకున్నారు.
ఇదీ చదవండి...