ETV Bharat / city

సమాజ సేవలో పోలీసుల త్యాగాలకు వెలకట్టలేం: గవర్నర్ - Police martyrdom commemoration weekends in ap

విశాఖలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. అమరవీరుల సంస్మరణార్థం ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో గవర్నర్ బిశ్వభూషణ్‌, మంత్రి అవంతి, ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు. సమాజసేవలో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్‌ కొనియాడారు. విపత్తు సమయాల్లో పోలీసుల కృషి అభినందనీయమన్నారు.

విశాఖ ఆర్కే బీచ్​లో కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Oct 20, 2019, 11:31 PM IST

విశాఖ ఆర్కే బీచ్​లో కొవ్వొత్తుల ర్యాలీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా... విశాఖ ఆర్కే బీచ్​లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలసి గవర్నర్ కొవ్వొత్తులు వెలిగించారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

దేశంలో పోలీసుల పాత్ర కీలకమైందని... సమాజానికి సేవ చేయడం కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. విపత్తు సమయాల్లో చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.

ఇదీ చదవండి

ఇన్‌ఛార్జి మంత్రులు మారారు... ఏ జిల్లాకు ఎవరంటే!!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.