విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం అయ్యారు. భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు మృతిచెందారు. మధురవాడలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనం రేపింది. కుటుంబంలో జరిగిన అంతర్గత కలహాలు కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కనిపిస్తోందని విశాఖ సీపీ మనీశ్‌కుమార్ సిన్హా తెలిపారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
విశాఖలో ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబ సభ్యులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్లాట్‌లో ఉన్న నలుగుర సజీవ దహనమయ్యారు.
మృతులు బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ గా గుర్తించారు. బంగారునాయుడు, నిర్మల దంపతులు కాగా..వారి పిల్లలు 22 ఏళ్ల దీపక్, 19 ఏళ్ల కశ్యప్ ఈ ఘటనలో మృతిచెందారు. వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడ వాసులు. బెహరాన్‌లో స్థిరపడిన బంగారునాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చున్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు బంగారునాయుడు భార్య నిర్మల హోమియో వైద్యురాలు ,పెద్దకుమారుడ ఎన్‌ఐటీలో డిగ్రీ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కశ్యప్ ఇంటర్ చదువుతున్నాడు.
ఘటనా స్థలిని పరిశీలించిన విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా.. నలుగురి మృతికి కారణాలపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారిలో పెద్దకుమారుడు మినహా మిగిలిన అందరిపైనా రక్తపు మరకలు ఉన్నాయన్న ఆయన.. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు కనిపిస్త్తోందన్నారు.
ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు తిరుపతి ఉపఎన్నిక ప్రచారం..17న పోలింగ్