విశాఖ హెచ్పీసీఎల్లో అగ్నిప్రమాదం జరిగింది. అధికారులు సకాలంలో సైరన్ మోగించి అందరినీ అప్రమత్తం చేయటంతో పెనుముప్పు తప్పింది. హుటాహుటిన కార్మికులను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. సీఐఎస్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
హెచ్పీసీఎల్లోని ఎమ్మెస్ బ్లాక్‌లో హైడ్రోజన్ పైప్‌లీక్ కావడంతో మంటలు చెలరేగాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. అత్యవసర సైరన్ ఐదుసార్లు మోగటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. మంటలను అదుపు చేసిన వెంటనే క్లియరెన్స్ సైరన్ మోగించటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి