విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలోని సుందరం ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో మరుగుతున్న ద్రవం లీకయ్యి... పనిచేస్తున్న కార్మికులపై పడి ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికులను ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ సమయంలో అనుమతులు లేకుండా పరిశ్రమలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... గుండె జబ్బుంటే కరోనాతో జాగ్రత్త: డా.మహేష్