చిన్న వయసులోనే చలనచిత్ర రంగంలో రాణిస్తున్న యువ దర్శకుడు డెన్నిస్ జీవన్ను ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ కుమార్ ప్రశంసించారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశాఖలో ఓ కళాశాలలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. యువ దర్శకుడు డెన్నిస్.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
2018లో ప్రపంచ మహిళా సదస్సులో జరిగిన లఘు చిత్ర పోటీలో ఉత్తమ లఘు చిత్రం పురస్కారాన్ని డెన్నిస్ జీవన్ అందుకున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడు, లావణ్య త్రిపాఠి నాయికగా డెన్నిస్ జీవన్ రూపొందించిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్' ప్రేక్షకుల మన్ననలను అందుకుందని కిషోర్ గుర్తుచేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల సంచాలకులు గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు.. ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు