విశాఖలో విదేశీ నకిలీ కరెన్సీ కలకలం రేపింది. 1 మిలియన్ విలువ చేసే నకిలీ యూరో కరెన్సీ నోటును మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 8.4 కోట్ల విలువ చేసే విదేశీ యూరో కరెన్సీని.. భారత కరెన్సీ కోటి రూపాయలకే ఇస్తామని మాయమాటలు చెప్పి మార్పిడి చేసేందుకు యత్నించారు. విశాఖ ద్వారకానగర్ లోని ఓ హోటల్ లో డీల్ కుదుర్చుకుంటుండగా పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ప్రశాంతంగా కేరళ 'స్థానిక' పోరు- ప్రముఖుల ఓట్లు