పారిశ్రామిక సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించే సేవలు మరిన్ని రంగాలకు విస్తరించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ పారిశ్రామికవేత్తలను కోరారు. విశాఖలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో పాలనాధికారి భేటీ అయ్యారు. విశాఖ నగరం, జిల్లాలో విస్తరించి ఉన్న జాతీయ, రాష్ట్రస్థాయి పారిశ్రామిక సంస్థలు విద్య, వైద్యం, పర్యావరణం, కాలుష్య నివారణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సేవలందిస్తున్నాయని కొనియాడారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యం, విద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. కలెక్టర్ విజ్ఞప్తికి పలు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండీ...