కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విశ్రాంత ఐఏఎస్, కేంద్రమాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. కొవిడ్ మహమ్మారిపై పోరుకు సమగ్ర విధానం అమలు చేయాలని సూచించారు. జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విధానం అమలుతో కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్‌లో పూర్తిగా విఫలమయ్యామన్న శర్మ…ఇప్పటికైనా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లకపోతే విపరీత పరిస్థితులు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రుయా' మరణమృదంగానికి నిర్లక్ష్యమే కారణమా ?