ETV Bharat / city

బాలింత అయినా... బాధ్యత మరువలేదు..!

ఈ మధ్యే కాన్పు అయ్యింది. మగబిడ్డ పుట్టాడు. 22 రోజుల చిన్నారి ఆలనాపాలనలో మునిగి ఉండాల్సిన సమయంలో సెలవుల్ని త్యజించి.. నగర భవిష్యత్తుకోసం, ‘కరోనా’ నిర్మూలన కోసం విధుల్లో చేరారు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన. నగరంపై పూర్తి అవగాహన ఉన్న తాను విధుల్లోకి రావడమే ఉత్తమమని భావించినట్టు చెప్పారామె. ‘ఈనాడు’తో ఆమె మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.

జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన
జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన
author img

By

Published : Mar 30, 2020, 11:31 AM IST

"నేను బిడ్డను ఇంట్లో పెట్టి కార్యాలయానికి వస్తున్నాను. వాడి బాగోగులు నా భర్త, మా అమ్మ చూస్తున్నారు. తరచూ నేనూ వెళ్లొస్తుంటాను. నాలాగే ఇల్లు, కుటుంబం ఉన్న ఎంతోమంది అధికారులు, సిబ్బంది ఈ నగరం కోసమే ఇప్పుడు విధుల్లో ఉన్నారు. వీరంతా జనం కోసమే. ‘కరోనా’ వైరస్‌ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాల్లో ఉన్నట్లు గుర్తించాను. వారిలో ధైర్యం నింపేందుకు జీవీఎంసీ విభాగాలు శక్తికి మించి శ్రమిస్తున్నాయి. అందులో నేనూ భాగం కావాలని వచ్చాను. మా శ్రమను గుర్తించి ప్రజలు ఎవరి జాగ్రత్తలో వారుంటారని ఆశిస్తున్నాను. అత్యవసరంగా బయటికొచ్చినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ, అవసరం లేనపుడు ఇంట్లోనే గడిపేలా అందరూ ప్రణాళికలు వేసుకోవాలి. ఇలా చేస్తే జీవీఎంసీ యంత్రాంగం శ్రమను ప్రజలు గుర్తించినట్లే.

నిత్యావసరాల కొరత రానివ్వం

మాకు అవసరమైనన్ని నిత్యావసర వస్తువులు దొరుకుతాయో లేదోనన్న కంగారు ప్రజల్లో ఉంది. ఆ భయాన్ని పోగొట్టాలని అనుకుంటున్నాం. నిత్యావసర వస్తువుల్ని సమకూర్చడం మా ప్రాధాన్యంగా ఉంది. ఏరోజుకారోజు సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఎవరిలోనూ ఇవి దొరకవేమో అన్న కంగారు వద్ధు తొందరపాటుతో తప్పిదాలు చేయొద్ధు.

eenadu-special-interview-with-gvmc-commissioner
కరోనా నివారణ చర్యల్లో జీవీఎంసీ చేసిన ఏర్పాట్లు

పరీక్షల సంఖ్య పెరగాలి

* ప్రతీ వార్డులోనూ మా బృందాలు తిరుగుతున్నాయి. లక్షణాలున్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా అలాంటి వారికి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. కుటుంబాలు కూడా దీన్నో సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. సహకరించాలి.

* ప్రస్తుతం నగరంలో కరోనా వైరస్‌ రెండో స్థాయిలో ఉంది. ఇది మూడో స్థాయికి చేరితే ఇబ్బందే. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమలో కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి.

* క్షేత్రస్థాయి సిబ్బంది అలవాట్లను కూడా మారుస్తున్నాం. గతంలోకన్నా భిన్నంగా ఆరోగ్య రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది. శానిటైజర్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

ఆ 200మంది కోసం గాలింపు..

మాదాకా వచ్చిన డాటా ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారిలో 200 మంది ఆచూకీ దొరకడం లేదు. వారెప్పుడో 7, 8 ఏళ్ల కిందట పాస్‌పోర్టులో పెట్టిన చిరునామాలే మా దగ్గర ఉన్నాయి. వీరు ప్రస్తుతం ఎక్కడున్నారనేది తెలియడం లేదు. ఎవరికైనా తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. గుర్తించిన వారి ప్రతీ ఇంటికీ స్టిక్కర్లు అంటిస్తున్నాం. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తున్నాం. ఇందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నాం.

నిరాశ్రయులకు అండగా..

జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 8 నిరాశ్రయుల షెల్టర్లు ఉన్నాయి. దీంతో పాటు మరో 600 మంది సామర్థ్యంతో కొత్తగా ఏర్పాట్లు చేశాం. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా ఆశ్రయం కోల్పోయిన వారిని ఇక్కడికి చేరవేస్తున్నాం."

ఇవీ చదవండి:

విశాఖ లాక్​డౌన్ : కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.