కరోనా నేపథ్యంలో విశాఖ తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. విశాఖ కేంద్రంగా 40కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు తూర్పు తీరాన్ని పరిరక్షిస్తుంటాయి. ఇక్కడ 5 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. దీనికి అనుబంధంగా ఉన్న నావల్ డాక్‌యార్డ్‌లో మరో 6 వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో ఏ ఒక్కరికి వ్యాధి సోకినా ఇబ్బందులు తప్పవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెలవుల్లో బయటకు వెళ్లి విధుల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. నౌకాదళ ఉద్యోగుల వసతిగృహాల ప్రాంగణాల వద్ద థర్మల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. 200 పడకలతో అత్యాధునిక క్వారంటైన్ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. ఉద్యోగుల సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంది. పలువురు నౌకాదళ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించాల్సి ఉన్న వారికి షిఫ్టు విధానం అమలు చేస్తోంది. నౌకాదళం గస్తీ నిర్వహణను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది.
ఇదీ చదవండి: