తూర్పు కోస్తా రైల్వేకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ షీల్డ్ లభించింది. దేశంలోని రైల్వేలలో అన్ని జోన్లలోనూ ట్రాఫిక్, అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్ వంటి అన్ని అంశాలల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన తూర్పు కోస్తా రైల్వేకి ఈ షీల్డ్ లభించింది. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ షీల్డ్‌ను తూర్పు కోస్తా అధికారులు అందుకోనున్నారు. ఈ షీల్డ్‌ను తూర్పు కోస్తా రైల్వే అందుకోవడం ఇది మూడోసారి.
2008-09, 2015-16 ఆర్థిక సంవత్సరాలలో ఈ అవార్డును సాధించిన తూర్పు కోస్తా రైల్వే 2019-20 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ అవార్డును సాధించడం విశేషం. 200.85 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి తూర్పు కోస్తా రైల్వే ఈ ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పింది. గతేడాది కంటే 4.73 శాతం వృద్ధిని నమోదు చేసింది.
భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేలో వాల్తేర్ డివిజన్ సహా ఖుర్డారోడ్ , సంబల్ పూర్ డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో వాల్తేర్ డివిజన్ దేశంలో అత్యున్నత పనితీరు కనబర్చే డివిజనల్లో ఒకటిగా పేరొందింది. ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ షీల్డ్, అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ షీల్డ్‌లను కూడా తూర్పు కోస్తా రైల్వే సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి : విశాఖలో టిడ్కో గృహప్రవేశాలకు యత్నం.. సీపీఐ నేతల అరెస్ట్