Dockyard Golden jubilee: విశాఖలోని నేవల్ డాక్‌యార్డ్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంకేతిక సదస్సును తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్త ప్రారంభించారు.నౌకాదళం కోసం తయారవుతున్న41 యుద్ధనౌకల్లో 38.. భారతదేశంలోనే తయారవుతున్నాయని..ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం అని గుప్త అన్నారు. రక్షణ రంగ అవసరాలకు అనుగుణంగా అంకుర సంస్థలు కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తే విదేశాల నుంచి దిగుమతులు బాగా తగ్గుతాయన్నారు.
" యుద్ధ సామగ్రిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలంటే ముందు మనం ఆత్మనిర్భర్‌గా మారాలి. నౌకల నిర్మాణం, నిర్వహణ, సాంకేతికత, ఆయుధాల్లో భారత్ ఎదిగిన తీరు అద్భుతం. అయితే ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది. ఇప్పటికీ విదేశాల నుంచి అనేక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధాలకు మనల్ని మనం సన్నద్ధంగా ఉంచుకునేందుకు విదేశాలపై ఆధారపడటం... భారత నౌకాదళానికైనా, ఇతర దళాలకైనా అతిపెద్ద సవాల్. ఏ ఒక్క యుద్ధ పరికరం కోసమైనా విదేశాలపై ఆధారపడకుండా మనల్ని మనం తయారు చేసుకోవడమే మా లక్ష్యం." -వైస్ అడ్మిరల్ దాస్ గుప్త , తూర్పు నౌకాదళ ప్రధానాధికారి.
ఇదీ చదవండి : P15B MARMA : సముద్రంలోకి బయలుదేరిన.. "పి15బి మర్మ"