ఇదీ చూడండి:
ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం బైక్ ర్యాలీ - CPM Bike Rally to Oppose Trump Tour
ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖలో సీపీఎం కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించడం సరికాదని.. ప్రభుత్వం ఆయన పర్యటన కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గు చేటని సీపీఎం నేతలు మండిపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి పూర్ణ మార్కెట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సీపీఎం కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకొని ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం బైక్ ర్యాలీ
ఇదీ చూడండి: