ETV Bharat / city

చలో గృహ ప్రవేశం... నేతల గృహ నిర్బంధం - టిడ్కో ఇళ్లపై తెదేపా కామెంట్స్

టిడ్కో గృహ సముదాయాల్లో ప్రవేశానికి సీపీఐ, తెలుగుదేశం ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి భారీ స్పందన లభించింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలను, లబ్ధిదారులను అడ్డుకోవటానికి చేసిన యత్నాలు ఉద్రిక్తతకు దారితీశాయి. అనంతపురంలో కొంతమంది గృహప్రవేశం చేశారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఇవ్వకుండా పేదలపై పరోక్షంగా ప్రభుత్వం అద్దె భారం మోపుతోందని ధ్వజమెత్తిన ప్రతిపక్షనేతలు.... గృహ నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.

tidco houses
tidco houses
author img

By

Published : Nov 16, 2020, 8:57 PM IST

చలో గృహ ప్రవేశం... నేతల గృహ నిర్బంధం

రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల్లో ప్రవేశానికి తరలివచ్చిన సీపీఐ, తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది ముఖ్య నేతలను ఆదివారం రాత్రి నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేసి.. గృహ ప్రవేశాలు చేసేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీపీఐ నేతలను అరెస్టు చేసిన పోలీసులు.... గుంటూరు, నరసరావుపేటలో తెలుగుదేశం నేతలు చదలవాడ అరవిందబాబును అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబును గృహనిర్బంధంలో ఉంచారు. కృష్ణా జిల్లాలో మాజీమంత్రి జవహర్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును నోటీసులిచ్చి గృహంలో నిర్బంధించారు.

ముందస్తు గృహనిర్బంధాలు, అరెస్టులపై నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వటంలో ఇబ్బంది ఏంటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. అఖిలపక్షంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని హితవు పలికారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ర్యాలీగా వెళ్లిన ప్రతిపక్ష శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తిరుపతి శివారులోని వికృతమాల గృహ సముదాయాల వద్దకు భారీగా చేరుకున్న లబ్ధిదారులకు పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది.

విశాఖలో.. మధురవాడ, వాంబే కాలనీల్లోని ఇళ్లలోకి గృహప్రవేశానికి యత్నించినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం వద్ద ఆందోళనలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడ్కో ఇళ్ల పంపిణీకి యత్నించిన నేతలను, నంద్యాలలో ర్యాలీగా వెళ్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతపురం జిల్లా హిందూపురంలోని టిడ్కో ఇళ్లలోకి సీపీఐ, తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో కొంతమంది గృహప్రవేశం చేశారు. అప్పులు చేసి డీడీలు కట్టడంతోపాటు... సకాలంలో ఇల్లు చేతికి రాక అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందిపడుతున్నామని లబ్ధిదారులు వాపోయారు. ప్రభుత్వం వేగంగా కార్యాచరణ రూపొందించి ఇళ్ల పంపిణీపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే... లబ్ధిదారులు ఆక్రమించుకోవటం తథ్యమని ప్రతిపక్ష నేతలు చెప్పారు.

ఇదీ చదవండి:

జనసేన.. రెండు రోజులపాటు కీలక సమావేశాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.