ETV Bharat / city

Drug Mafia: డ్రగ్స్ వచ్చేది అక్కడి నుంచే.. అడ్డుకునే సత్తా మాకే ఉంది: సీపీఐ నారాయణ - ఏపీలో డగ్స్ మాఫియా

రాష్ట్రంలో సంచలనంగా మారిన డ్రగ్స్ అంశంపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. విజయవాడకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పిన ఆయన.. దాన్ని అడ్డుకోవడం వామపక్షాలతోనే సాధ్యమన్నారు.

అఫ్గాన్‌ నుంచి విజయవాడకు డ్రగ్స్
అఫ్గాన్‌ నుంచి విజయవాడకు డ్రగ్స్
author img

By

Published : Oct 8, 2021, 4:37 PM IST

రాష్ట్రంలో సంచలనంగా మారిన డ్రగ్స్ అంశంపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 239 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించిన నారాయణ.. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం.. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన డగ్స్ అంశంపై మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ వాడేవాళ్లను పట్టుకుంటున్నారు కానీ.. సరఫరా చేసేవారిని మాత్రం పట్టుకోవటం లేదని ఆరోపించారు. అఫ్గాన్ నుంచి విజయవాడకు డ్రగ్స్ వస్తున్నాయని నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం డ్రగ్స్​పై సిట్ వేసినా..దానివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని అన్నారు. డ్రగ్స్ మాఫియా వంటి దారుణాలకు అడ్డుకట్ట వేయడం వామపక్షాలతోనే సాధ్యమవుతుందన్నారు.

డ్రగ్స్ వాడేవాళ్లను పట్టుకుంటారు.. సరఫరా చేసేవారిని పట్టుకోరు. భూములు, డ్రగ్స్‌పై ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది. కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. అఫ్గాన్‌ నుంచి విజయవాడకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయాలంటే వామపక్షాలతోనే సాధ్యం. - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

విశాఖ స్టీల్ దేశానికే గర్వకారణం: డి.రాజా
విశాఖ స్టీల్‌ప్లాంట్ రాష్ట్రంతోపాటు దేశానికే గర్వకారణమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ.. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. భాజపాను ఆర్​ఎస్​ఎస్ సంస్థ నడుపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సీపీఐ బలపడాలని, అందుకోసమే జాతీయ పార్టీ సమావేశాలు విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇదీ చదవండి

Minister Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్​ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.