గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,242 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. మరణాల సంఖ్య 5,981కు ఎగబాకింది. రాష్ట్రంలో 6,58,875 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 54,400మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 72,811 కరోనా పరీక్షలు నిర్వహించగా... రాష్ట్రంలో ఇప్పటివరకు 60,94,206 మందికి వైరస్ నిర్థరణ పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు
చిత్తూరు జిల్లాలో 863, పశ్చిమగోదావరిలో 853, తూర్పుగోదావరిలో 826 మందికి పాజిటివ్ నిర్థరణ అయింది. ప్రకాశంలో 582, గుంటూరులో 562, కృష్ణాలో 469, నెల్లూరులో 413, అనంతపురంలో 411, కడప జిల్లాలో 408, విశాఖలో 222, విజయనగరంలో 221, కర్నూలులో 220, శ్రీకాకుళంలో 192 కరోనా కేసులు బయటపడ్డాయి.
జిల్లాల వారీగా కరోనా మృతులు
కరోనాతో కృష్ణా జిల్లాలో ఆరుగురు, అనంతపురం, చిత్తూరులో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి: