ETV Bharat / city

భారీగా కరోనా రికవరీలు...అయినా అప్రమత్తత తప్పనిసరి - విశాఖ జిల్లాలో కొవిడ్ కేసులు

విశాఖ జిల్లాలో కొవిడ్ నుంచి కొలుకున్న వారి సంఖ్య యాభై ఐదు వేల మార్కును దాటింది. కొత్త కేసుల నమోదు జోరు పూర్తిగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నా.. రెండో ముప్పు మాత్రం పొంచి ఉందన్నది వైద్య నిపుణుల అంచనా. శీతాకాలం, మంచు పెరగడం, కోస్తా జిల్లాల్లో శ్వాస కోశవ్యాధుల పరంగా సమస్యలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు. గతంలో తీసుకున్న జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండగలు, ప్రయాణాలలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు తరుచుగా శుభ్రపరుచుకోవడం తప్పని సరిగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

Corona cases
Corona cases
author img

By

Published : Nov 7, 2020, 9:28 PM IST

విశాఖ జిల్లాలో కొవిడ్ కేసుల రికవరీ యాభై ఐదు వేలు దాటింది. జిల్లాలో ఇంతవరకు నమోదైన కేసుల్లో మొత్తం డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 55,005 గా నమోదైంది. కొత్తగా కొవిడ్ బారిన పడుతున్న వారు తీవ్ర లక్షణాలకు లోనవుతున్న వారి శాతం, ఆసుపత్రులలో ఉంచాల్సి వస్తున్న వారి శాతం కేవలం ఐదారు శాతంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది అసుపత్రులపై ఒత్తిడి తగ్గడానికి కారణమైంది. నాలుగు జిల్లాల కొవిడ్ ఆసుపత్రి విమ్స్​లోనూ పదుల సంఖ్యలోనే బాధితులు చికిత్స పొందుతున్నారు.

ప్రతి రోజు కొత్త కేసుల సంఖ్య మాత్రం వంద నుంచి నూట యాభై వరకు ఉంటున్నాయి. యాక్టివ్ కేసులు సంఖ్య 1700 వరకు ఉంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57,179. మొత్తం మృతుల సంఖ్య 484 గా ఉంది. ప్రతి రోజు ఆరు నుంచి ఆరున్నర వేల మందికి జిల్లా వ్యాప్తంగా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. గరిష్ట స్థాయిలో జిల్లాలో ఆగస్టు నెలలో దాదాపు 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటి ఉద్ధృతి సెప్టెంబరు నెలలో తగ్గింది. అక్టోబరులో దాదాపు ఏడు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 75 వరకు నమోదైంది.

విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 550 పడకల కొవిడ్ వార్డులో నూట యాభై మంది వరకు బాధితులు ఉన్నారు. ప్రజలు కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు మాత్రం పాటించి తీరాలని, లేనట్టయితే ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా హోర్డింగ్​లు పెట్టి, కాలనీలలో కొవిడ్ నివారణ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇక్కడ మారుమూల గిరిజనులకు కూడా కొవిడ్ బారిన పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి వంటి ప్రాంతాలపై ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కువ మందిని పరీక్షలు చేయించుకునేట్టుగా అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి

కరోనా రెండో 'అల'జడి...అప్రమత్తతతో వైరస్​కి చెక్​ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.