ETV Bharat / city

విశాఖ జిల్లాలో ఒక్క నెలలోనే 25,899 కేసులు - విశాఖ జిల్లాలో ఒక్క నెల్లోనే 25,899 మందికి పాజిటివ్‌

విశాఖ జిల్లాలో కరోనా కలవరపెడుతోంది. వైరస్‌ బారినపడ్డ జనాల సంఖ్య జిల్లాలో అంతకంతకూ పెరుగుతోంది. మార్చి నుంచి మొత్తం పాజిటివ్‌ కేసుల్ని తీసుకుంటే.. ఈ ఆగస్టు మాసంలోనే 69.79శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

corona cases
corona cases
author img

By

Published : Sep 1, 2020, 6:05 PM IST

జులై చివరి నాటికి పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నవారు 7548 మంది ఉన్నారు. ఆగస్టు ముగిసేసరికి ఆ సంఖ్య 6511కి చేరింది. యంత్రాంగం పడకలపరంగా అప్రమత్తంగా ఉండటం.. వారికి సకాలంలో చికిత్స అందేలా డిశ్ఛార్జిలు కూడా భారీగా అవుతుండటంతో పడకల కొరత తలెత్తలేదని అధికారులంటున్నారు.

ఆగస్టు 3.. రికార్డు!

ఒక రోజులో ఎక్కువ మంది చికిత్స పొందిన రోజుగా ఆగస్టు 3 రికార్డయ్యింది. ఆ రోజు ఏకంగా 9098 మంది చికిత్స పొందినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నుంచి డిశ్ఛార్జీలు పెరిగి చికిత్స పొందుతున్న వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇలా ఆగస్టు 17కు 4576 మందికి చేరుకుంది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి కొద్దికొద్దిగా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది.

కేసులు.. కొన్ని ప్రాంతాల్లోనే!

1-5రోజుల వ్యవధిలో వరుసగా పాజిటివ్‌ కేసులొస్తుంటే దాన్ని వెరీ యాక్టివ్‌ క్లస్టర్‌ అని, అదే పాజిటివ్‌ తర్వాత 5-14 రోజుల మధ్య పాజిటివ్‌లు నమోదవుతోంటే యాక్టివ్‌ క్లస్టర్‌గా పిలుస్తున్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపి జులైలో 393 ఉండేవి. అవి ఆగస్టు 31కి 109 ప్రాంతాలకే తగ్గాయి. దీన్నిబట్టి జిల్లాల్లో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల నుంచే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయని స్పష్టమైంది. ఈ క్లస్టర్లు అగ్రభాగం నగరంలోనే ఉన్నాయి.

ప్రత్యేక చర్యలు..

కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆగస్టులో పడకల సంఖ్యను బాగా పెంచారు. ఆసుపత్రుల్లో 6వేలకు పైగా, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో 4వేలకు పైగా పడకల్ని ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు ఇప్పటికీ సరిపోవట్లేదు.

రోగుల్ని గుర్తించేందుకు ఈనెలలోనే 75వేలకు పైగా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా అన్నీ కలిపి 2.74 లక్షల పరీక్షలు చేశారు.

అన్నింట్లోనూ అధిక నెల!

  • పాజిటివ్‌లు ఆగస్టు నెల మొత్తం - 25,899
  • ఆగస్టులో రోజువారీ సగటు పాజిటివ్‌లు - 835.45
  • డిశ్ఛార్జిలు ఆగస్టు నెల మొత్తం - 26,799
  • ఆగస్టులో రోజువారీ సగటు డిశ్ఛార్జిలు - 864.48

మరణాలు

  • ఆగస్టు నెల మొత్తం - 167
  • సగటు మరణాలు - 5.38

జిల్లాలో కొవిడ్‌ కొత్త కేసుల నమోదు స్వల్పంగా తగ్గినా ఇది తాత్కాలికమేనని, రానున్న రెండు వారాలు అత్యంత కీలకం కాబోతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 434 కేసులు కొత్తగా నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారని తెలిపారు. కైలాసపురానికి చెందిన 52ఏళ్ల వ్యక్తి, మర్రిపాలేనికి చెందిన 63ఏళ్ల మహిళ, నాతవరానికి చెందిన 55ఏళ్ల, ఎస్‌.రాయవరానికి చెందిన 47ఏళ్ల వ్యక్తులు, అరకు వ్యాలీకి చెందిన 67ఏళ్ల, సీతమ్మధారకు చెందిన 80ఏళ్ల వృద్ధులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇదీ చదవండి: టెలికాం షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.