ETV Bharat / city

పాత గాజువాక జంక్షన్‌లో తెదేపా-వైకాపా నాయకుల ఘర్షణ...తోపులాట - విశాఖ బంద్​

Conflict Between TDP And YSRCP: విశాఖ బంద్​ నేపథ్యంలో పాత గాజువాక జంక్షన్‌లో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఎదురుపడిన ఇరు వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. విశా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖ బంద్​కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది.

Conflict Between TDP And YSRCP
తెదేపా-వైకాపా నాయకుల ఘర్షణ
author img

By

Published : Mar 28, 2022, 12:20 PM IST

Updated : Mar 28, 2022, 12:34 PM IST

పాత గాజువాక జంక్షన్‌లో తెదేపా-వైకాపా నాయకుల ఘర్షణ

విశాఖపట్నం పాత గాజువాక జంక్షన్‌లో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖ బంద్​కు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ.. పాత గాజువాక జంక్షన్ లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎదురుపడిన తెదేపా, వైకాపా శ్రేణులు.. పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. నినాదాలు శృతిమించి ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి: తెదేపా ఆరోపణలు ఖండిస్తున్నాం.. రూ.48 వేల కోట్ల లెక్కలు ఇవీ : బుగ్గన

Last Updated : Mar 28, 2022, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.