దేశంలో ప్రస్తుత వాతావరణం మార్పులపై విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఆచార్య పివి సుబ్రహ్మణ్యం స్మారక ప్రసంగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ రమేష్, డీఎస్టీ సలహాదారు డాక్టర్ అఖిలేష్ గుప్తా, ఏయూ రెక్టార్ ప్రసాద్ రెడ్డి, రిజిస్టార్ బైరాగి రెడ్డి పాల్గొన్నారు. వాతావరణ అధ్యయనం, పరిశోధనలపై ఏయూలోని ఎనిమిది విభాగాలు, ఐఎండి సంయుక్తంగా ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నట్టు ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రమేష్ తెలిపారు. వాతావరణ మార్పులపై నిపుణులు మరింత లోతుగా పరిశోధనలు జరపాలన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్నారు. వాతావరణ మార్పులపై పరిశోధనలు పెరగాలన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టాలని కోరారు.
ఇదీ చదవండి :