విద్యార్థులకు సాఫ్ట్స్కిల్స్ను పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం విశాఖలోని ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో రైటర్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో 'కంప్లీట్ బుక్ ఆఫ్ సాఫ్ట్స్కిల్స్'ను ఆవిష్కరించారు. ఏయూ జర్నలిజం విభాగ విశ్రాంత ఆచార్యులు పీ. బాబి వర్ధన్, ఏయూ సాప్ట్స్కిల్స్ శిక్షకుడు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్లు సంయుక్తంగా రచించిన ఈ పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు.
పుస్తక రచనా నైపుణ్యాలను, సామర్థ్యాలను విద్యార్థులకు అలవరచాల్సిన అవసరం ఉందన్నారు. విశ్రాంత ఆచార్యులు నేటితరం యువతతో సంయుక్తంగా పుస్తక రచన చేయాలని వీసీ సూచించారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు.. సాఫ్ట్స్కిల్స్గా నేడు చెబుతున్న విభిన్న జీవన నైపుణ్యాలను అందించేవన్నారు. నేటితరం దీనిని ఒక పాఠ్యాంశంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. దీనిని భర్తీ చేసే దిశగా ఈ పుస్తకం రావడం మంచి పరిణామమన్నారు. దీనిని చిన్న భాగాలుగా తీర్చిదిద్ది, డిజిటల్ రూపంలో తీర్చిదిద్దారని వీసీ తెలిపారు.
ఇవీ చదవండి: