స్మగ్లింగ్ నిరోధానికి తమిళనాడులో కోస్ట్‌గార్డు, డిఆర్ఐ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తొమ్మిది కిలోల బంగారాన్ని, ఐదుగురు జాలర్లను పట్టుకున్నామని కోస్ట్‌గార్డు విశాఖ కార్యాలయం వెల్లడించింది. తమిళనాడులోని మండపం వద్ద సెయిలర్ ఫిషింగ్ బోట్లో ఇంజిన్ రూంలో ఓ గుడ్డ సంచిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఐదుగురు మత్స్యకారులు, పట్టుకున్న వస్తువులను మరింత లోతైన విచారణ కోసం డిఆర్ఐకి అప్పగించామని కోస్ట్‌గార్డు వివరించింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.
శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం.. కోస్ట్‌గార్డు అధికారులతో కలిసి అక్రమ బంగారం రవాణా చేస్తున్న చేపల బోటు ఆచూకీ సముద్రంలో కనిపెట్టింది. తమిళనాడులోని మండపం తీరానికి సమీపంగా ఈ బోటు చిక్కింది. ఈ ఏడాది మార్చినెలలో తమిళనాడు రామేశ్వరం వద్ద ఇదే తరహాలో శ్రీలంక నుంచి చేపల బోట్లో 15 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న విషయాన్ని కోస్ట్‌గార్డు వెల్లడించింది.
ఇదీ చదవండీ.. భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న భారత కోస్ట్ గార్డు