ETV Bharat / city

త్వరలోనే కార్మికుల బకాయిలు చెల్లిస్తాం: చిట్టివలస జ్యూట్ మిల్ యాజమాన్యం - minister muttamsetti

చిట్టివలస జ్యూట్ మిల్ కార్మికులకు చెల్లించవలసిన బకాయిలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు... సంస్థ యాజమాన్యంతో చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక నాయకులకు సానుకూలంగా స్పందించిన యాజమాన్యం.. త్వరలోనే చెల్లింపులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది.

chittivalasa juite mill
త్వరలోనే కార్మికుల బకాయిలు చెల్లిస్తాం
author img

By

Published : Jul 15, 2021, 4:33 PM IST

పెండింగ్​లో ఉన్న చిట్టివలస జ్యూట్ మిల్ కార్మికుల బకాయిలను వెంటనే పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించారు. మంత్రి సమక్షంలో ఆయన నివాసంలో జ్యూట్ మిల్ యాజమాన్యం, కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. జ్యూట్ మిల్ మూసివేసిన తర్వాత యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించలేదని కార్మిక సంఘాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. సంస్థలో పనిచేసిన 4,273 మంది కార్మికులకు రూ. 32 కోట్లు చెల్లించామని.. మిగిలిన పెండింగ్ బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.

కార్మికలు డిమాండ్లు..

సర్వీసులో మృతి చెందిన కార్మికుల భార్యకు రూ. 5,000 పరిహారం చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నారు. 2019లో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులందరికీ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. మారుపేర్లతో ఉన్న కార్మికుల గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ చెల్లించాలని డిమాండ్​ చేశారు. రిటైరయిన కార్మికులకు పెన్షన్ వచ్చేందుకు 10-D ఫారంపై సంతకాలు చేయటానికి యాజమాన్యం సిబ్బందిని నియమించాలన్నారు. సర్వీసులో ఉన్న కార్మికుల పీఎఫ్ కూడా చెల్లించాలని, పీఎఫ్ ఆఫీస్ వారు అడిగిన బ్రేక్ ఆఫ్ సర్వీస్ వివరాలను మిల్లు యాజమాన్యం తెలపాలని కోరారు.

మంత్రి ముందు యాజమాన్యం హామీ..

ఈ డిమాండ్లలో 210 మంది స్పెషల్ బదిలీ, అప్రెంటిస్ ఉద్యోగుల పూర్తి బకాయిలు జులై 31 లోపు.. మిగిలిన బాకాయిలను మొత్తంగా ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని జ్యూట్ మిల్ యాజమాన్యం మంత్రి ఎదుట హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చేయొద్దని.. హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15 కు బకాయిలు చెల్లించాలని మిల్ యాజమాన్యానికి మంత్రి సూచించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జ్యూట్ మిల్ కార్మికుల బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారని.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సమావేశంలో మిల్ ప్రతినిధి కేకే భజౌరియా, కాంగ్రెస్ కార్మిక సంఘం, ఏఐటీయూసీ, టీఎన్ టీయూసీ, ఐఎన్ టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

'నాటు సారాను అరికట్టండి.. తయారీదారులపై చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.