ETV Bharat / city

రైల్వే ఉద్యోగాలన్నారు... చివరకు అరెస్టయ్యారు!

రైల్వే ఉద్యోగమంటే ఆశ పడనిదెవరు? అదే ఆసరాగా చేసుకుందో ముఠా. మేం ఉద్యోగం ఇప్పిస్తాం.. మాకు డబ్బివ్వండి! అంటూ నమ్మించారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు.

author img

By

Published : Jul 13, 2019, 8:55 PM IST

Updated : Jul 13, 2019, 9:26 PM IST

cheaters_arrested by_railway police_in_vishakapatnam

విశాఖలో ఓ ముఠా.. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. రైల్వే ఉద్యోగాలంటూ అమాయకులకు ఆశ చూపింది. 10 మందికి ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు నిందితులు. ఈ విషయం ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలిసింది. వారు వేసిన నిఘాలో.. ముఠా చిక్కుకుంది. విశాఖకు చెందిన రాజశేఖర్​ రావు, శ్రీనివాస్​, పేడాడ అనంతరావును రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ నియామక పత్రాలు, రూ.లక్ష డిపాజిట్ రసీదులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం విచారణ కోసం రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ముఠా గుట్టురట్టు చేసిన ఆర్పీఎఫ్​ ప్రత్యేక బృందానికి అధికారులు 10వేల రివార్డు అందజేశారు.

Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోట నుంచి ఈనెల 15 న తెలవారుజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ మార్కు 3రాకెట్ ప్రయోగం జరిపేందుకు జోరుగా పనులు జరుగుతున్నాయి. షార్ లోని రెండో ప్రయోగ వేదిక ద్వారా జీఎస్ఎల్వీ మార్కు3 వాహక నౌక నుంచి రోదసి లోకి పంపేందుకు రిహార్సల్స్ పూర్తి చేశారు. ఈరోజు శనివారం రాకెట్ ప్రయోగ అనుమతి సమావేశం జరగనుంది. ప్రయోగ తేదీ అధికారికంగా ప్రకటించనున్నారు. శనివారం ప్రీ కౌంట్ డౌన్ ఆదివారం కౌంట్ డౌన్ జరుగుతుంది. ఇసో ఛైర్మన్ శివన్ ఈరోజు షార్ కు చేరుకుంటారు.

Body:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీప శ్రీ హరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2 ద్వారా జీఎస్ఎల్వీ మార్కు3 ప్రయోగం విజయవంతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6.51గంటల కు కౌంట్ డౌన్ మొదలవుతుంది. ప్రతిష్టాత్మకంగా చేస్తున్న
ఈరాకెట్ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్ర పతి కోవింద్ కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం రానున్నారు. ఆయన పర్యటన అంతా షార్ లోనే రెండో గేటు లోపల ఉండేలా అధికారులు రూట్ మాప్ తయారు చేశారు. ఆదివారం సాయంత్రం షార్ కు చేరుకుని కొత్తగా ఏర్పాటు చేసిన రెండో అనుసంధాన భవనం. రెండో ప్రయోగ వేదిక పరిశీలన చేస్తారు.ప్రయోగ వేదిక పై ఉన్న జీఎస్ఎల్వీ మార్కు3 వాహక నౌకను వీక్షించనున్నారు.15న వేకువజామున 2.30 గంటలకు మిషన్ నిర్వహణ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ జీఎస్ఎల్వీ మార్కు3 ప్రయోగం వీక్షించనున్నారు. ఉదయం 9గంటలకు దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.షార్ పరిసరాల్లో భద్రతా బలగాలు మొహరించాయి.
నోట్.సార్ రాత్రి నెల్లూరు నుంచి పంపిన చంద్రయాన్ విజువల్స్ వాడగలరు.

Conclusion:
Last Updated : Jul 13, 2019, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.