నాలుగు నెలల పాలనలో ప్రభుత్వం అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సరిదిద్దుకోలేని స్థాయిలో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల వద్ద కూడా జే-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న చంద్రబాబు... ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రం మీదుగా గోదావరి జలాలు శ్రీశైలం తీసుకెళ్తాం అంటున్నారని... ఇది ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన విషయం కాదని ఉద్ఘాటించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయమని అర్థం చేసుకోవాలని హితవుపలికారు. కొత్త రక్తానికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి