విశాఖ నగర పాలకసంస్థ... పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. విశాఖ పర్యటనలో భాగంగా స్మార్ట్ సిటీ, స్వచ్ఛ సర్వేక్షన్ అంశాలపై జీవీఎంసీ అధికారులతో ఆయన సమీక్షించారు. నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటును ప్రశంసించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.400 కోట్లు విడుదల చేశామన్న కిషన్ రెడ్డి... ఇంకా రూ.100 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. గృహనిర్మాణ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కేంద్రమంత్రిగా... విశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తీరప్రాంత భద్రత, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ అధికారులతోనూ కిషన్రెడ్డి సమావేశమయ్యారు.
ఇవీ చదవండి..