పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మేజర్ పోర్టును నిర్మించాల్సి ఉంది. విశాఖ పోర్టు ఛైర్మన్గా కృష్ణ బాబు ఉన్న సమయంలోనే నౌకాయాన మంత్రిత్వశాఖ వీటిపై అధ్యయనం చేయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్నీ సేకరించింది. ఉపగ్రహ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట సమీపంలో ఉన్నందున దుగ్గరాజపట్నం భారీ పోర్టు కార్యకలాపాలకు అనుకూలం కాదని నిర్ణయించారు. సమీపంలోనే కృష్ణ పట్నం పోర్టు ఉన్నందున కార్గో సమస్యలు ఉంటాయని అప్పట్లోనే తేల్చారు. అందుకే.. ప్రకాశం జిల్లా రామయ్యపట్నం ఎలా ఉంటుందనే మరో ఆలోచన చేశారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పోర్టుకు జనవరిలోనే.. శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం పోర్టు ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా తేల్చుకోలేని విషయం.
ఇదీ చదవండి: