విశాఖ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి నుంచి సీబీఐ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్లాంట్ అధికారి ఆర్.పదంసింగ్ నుంచి రూ.1.86 కోట్లు సీబీఐ స్వాధీనం చేసుకుంది. కేంద్ర వ్యవసాయశాఖ ప్లాంట్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్‌లో పదం సింగ్ పనిచేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రూర్కీలో జరిపిన సోదాల్లో నగదు పట్టుబడింది. సరకు ఎగుమతుల అనుమతికి లంచం తీసుకున్నారని పదంసింగ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదంసింగ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.
ఇవీ చూడండి