ఓటర్లు తమకు నచ్చిన నేతను స్వేచ్ఛగా ఎన్నుకున్న రోజే ప్రజాస్వామ్యం వచ్చినట్లని విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ అన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తాతారావుతో కలిసి అరిలోవ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... ఇప్పుడిప్పుడే జనాల్లో ప్రశ్నించే తత్వం పెరుగుతోందని మాజీ ఐపీఎస్‌అన్నారు. ప్రశ్నించేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టారన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.
ఇవీ చూడండి.
అరకు కాఫీకి భౌగోళిక సూచి