Cake Show in Visakha : విశాఖ బీచ్ రోడ్‌లో నగరవాసులను అలరించేందుకు కేక్‌లు సిద్ధమవుతున్నాయి. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా బెంగళూరు కేంద్రంగా సాగుతున్న ప్రదర్శనను తొలిసారి విశాఖలో నిర్వహించబోతున్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను, విశాఖ సాగర తీరం అందాలను ప్రతిబింబించేలా కేక్‌లను తీర్చిదిద్దుతున్నారు. విశాఖ ప్రజలు ఈ ప్రదర్శనను తప్పకుండా ఆదరిస్తారని రూపకర్త లక్ష్మీపతి వర్మ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేకులన్నీ తినే పదార్థాలతో, చూసేందుకు ఆకట్టుకునేలా ఉండేట్టు రూపొందిస్తున్నారు.
" క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా కేకుల ప్రదర్శన నిర్వహిస్తున్నాం. నలుగురం స్నేహితులం కలిసి ఓ బృందంగా ఏర్పడి ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. కర్ణాటకలో 47ఏళ్లుగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. విశాఖలో కూడా అదే తీరుగా నిర్వహిస్తున్నాం. ప్రదర్శనలో ఉంచే కేకులు ఆకర్షించేలా విభిన్న రీతుల్లో తయారు చేస్తున్నాం. పాడవకుండా ఎక్కువ రోజులుండి...తినేందుకు రుచిగా ఉండేలా కేకులను తయారు చేస్తున్నాం. విశాఖ వాసులంతా తప్పకుండా ఈ ప్రదర్శనకు విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. " - లక్ష్మీపతి వర్మ, కేక్ ఎగ్జిబిషన్ రూపశిల్పి.
" ఈ కేకుల తయారీకి వాడే పదార్థాలన్నీ తినేందుకు ఉపయోగించేవే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతీ ఒక్కరిని ఆకర్షించేలా వీటిని మేము తయారు చేస్తున్నాం." - బృందంలోని కేకుల తయారీదారు.
" విశాఖ నగరానికి ప్రతీకగా వైజాగ్ బీచ్ లోని లైట్ హౌస్ కాన్సెప్ట్ తో ఈ పెద్ద కేకును తయారు చేస్తున్నాం. సుమారు 10 అడుగులుండే ఈ కేకు ప్రదర్శనలోనే భారీ కేకు." - బృందంలోని కేకుల తయారీదారు.
" విశాఖలో మొదటి సారి జరుగుతున్న ఈ కేకుల ప్రదర్శనలో క్రిస్మస్, శాంతాక్లాజ్ థీంతో కేకులను సిద్ధం చేస్తున్నాం. ఇక్కడకు రావడం మాకు ఆనందంగా ఉంది. " -బృందంలోని కేకుల తయారీదారు.
అచ్చం నిజమైన ప్రతిమల్లా అనిపిస్తున్న ఈ కేక్‌లు.... ఒకవైపు నోరూరిస్తూ... మరోవైపు కనుల విందు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి : Traditional food items preparing shop : ఒకరి ఆలోచన.. తోటి వారికి ఉపాధిగా మారింది.. ఎలా అంటే...?