విశాఖ విమానాశ్రయంలో(Visakhapatnam airport news ) ఓ వృద్ధురాలి బ్యాగ్లో బుల్లెట్లు కలకలం రేపాయి. ఆమె వద్ద నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు(Bullets seized from woman at airport news). పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ్ ఆర్కే బీచ్ వద్ద నివాసం ఉంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్ వెళ్లేందుకు ఇండిగో విమానం టిక్కెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో వృద్ధురాలి బ్యాగును తనిఖీ చేసిన అధికారులు బుల్లెట్లను గుర్తించి.. ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.
బుల్లెట్లు అతడివేనా..!
సదరు వృద్ధురాలి పెద్దనాన్న పిస్టల్ లైసెన్స్ కలిగి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన మృతి చెందటంతో ఆయన బ్యాగ్లో వస్త్రాలు పెట్టుకుని హైదరాబాద్ వద్ద ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్తున్నానని.. బుల్లెట్లను తాను గమనించలేదని సుజాత వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి