రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామ సూర్యనారాయణపై.. అమరావతి ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రామ సూర్యనారాయణకు పిచ్చి ముదిరిందని విమర్శించారు.
"కొన్ని తరాలుగా మా డబ్బులతో కట్టుకున్న.. మా సంఘం భవనాలను ప్రభుత్వానికి అప్పజెప్పాలి. మీది వ్యక్తుల కలియక.. మాది పలు సంఘాలు కలయిక. ఉద్యోగ సంఘాలను చీల్చాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న మీ ఉద్దేశ్యం ఏమిటో, మీ వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలి." అని బొప్పరాజు డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలపై ప్రతి ఉద్యోగి, ప్రతి సంఘం ఆలోచించాలన్నారు. ఇన్ని సంఘాలను పక్కన పెట్టి.. ఆయన సంఘానికి ఎందుకు గుర్తింపు ఇచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భవనాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేయడం ఏమిటని ఆగ్రహించారు. పీఆర్సీ, ఉద్యోగ సమస్యలపై ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. తక్షణమే రామ సూర్యనారాయణ సంఘం గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీ పిటిషన్ను ఉపసంహరణ చేసుకోవాలని.. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతామని బొప్పరాజు హెచ్చరించారు.
ఎంతో మందికి ప్రాణానిస్తున్న విశాఖ
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని.. ఎంతో మంది ప్రాణా త్యాగాలతో స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కరోనా నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ 150 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు.
ఇదీ చదవండి: