విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు స్థానికంగా కలకలం రేపాయి. నుర్మతి పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల సమీపంలో అమర్చి ఉన్న 4 మందుపాతరలను పోలీసులు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. అవకాశం లేదని తేలిన పరిస్థితుల్లో.. ఎస్పీ అట్టాడా బాబూజీ ప్రత్యక్ష సూచనల మేరకు అక్కడే పేల్చేశారు. శబ్దం గట్టిగా రావడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఏం జరిగిందోనని నుర్మతి గ్రామస్తులు ఆందోళన చెందారు. పోలీసులే మందుపాతరలు పేల్చారనే విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మావోయిస్టుల సానుభూతిపరులుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఇవీ చూడండి-విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్