ETV Bharat / city

విశాఖ తెదేపా కార్యాలయంలో రక్తదాన శిబిరం - విశాఖ తెదేపా కార్యాలయంలో రక్తదానం వార్తలు

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు మేరకు విశాఖలోని అన్ని వార్డుల్లో రక్తదాన శిబిరాలను తెదేపా నిర్వహిస్తోంది. ఎందరో రోగులకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని విశాఖ ప్రజలు విజయవంతం చేయాలని పార్టీ సీనియర్ నేతలు కోరారు.

blood donation camp conducted in tdp office, vishaka

author img

By

Published : Oct 8, 2020, 8:14 PM IST

విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా రక్తదానం శిబిరాన్ని గురువారం నిర్వహించాయి. హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపు మేరకు మూడు రోజులు పాటు రక్తదాన శిబిరాన్ని పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు.

కరోనా సమయంలో రక్తదాతలు ముందుకు రాకపోవటంతో బ్లడ్​ బ్యాంకుల్లో నిల్వలు అడుగంటాయి. ఈ క్రమంలో ఎందరో రోగులకు ఉపయోగపడే రక్త దాన శిబిరాన్ని విశాఖలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పార్టీ కార్య కర్తలే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే అందరూ రక్త దానం చేయాలని సీనియర్ నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ కోరారు.

ఇదీ చదవండి:

న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.