ETV Bharat / city

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

author img

By

Published : May 26, 2021, 8:09 AM IST

రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఆందోళన కలిగిస్తోన్నాయి. కాకినాడ జీజీహెచ్‌లో మంగళవారం ఒక్క రోజు 13 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖతోపాటుగా పలు జిల్లాల్లో సైతం బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నారు.

Black fungus cases
పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

రోజురోజుకు బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో మంగళవారం ఒక్క రోజు 13 కొత్త కేసులు వచ్చాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 38కి చేరాయి. వీరిలో ఇద్దరికి దవడ ఎముకకు ఫంగస్‌ చేరడంతో వైద్య బృందం శస్త్రచికిత్స చేసిందని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఆర్‌.మహాలక్ష్మి తెలిపారు.

విశాఖ కేజీహెచ్‌లో 40 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చేరగా, వీరిలో ఎల్లయ్యరెడ్డి (67) అనే వ్యక్తి మృతి చెందారు. నగరంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 30 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండల పరిధి బిలేహల్‌ గ్రామ బ్రాంచి పోస్ట్‌మాస్టర్‌ శశిధర్‌ బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డట్లు మండల వైద్యాధికారి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఇవీ చూడండి...

విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.