రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విశాఖలో అన్నారు. రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధించడాన్ని.. ఓ తుగ్లక్ చర్య గా విష్ణు కుమార్ రాజు అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి.. మందుల కొరత లేకుండా చేయాలని కోరారు. రోగుల అందించే మందులపై 3 నెలలు జీఎస్టీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని అన్నారు. కరోనా పరీక్షల ఫలితాలు త్వరితగతిన అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రల్లో భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ.. అధికార యంత్రాంగానికి కరోన నియంత్రణపై లేదని విమర్శించారు. కరోనా సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకా మూడేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు.
ఇవీ చదవండి: