ETV Bharat / city

"పదవి పోయినా నేనే సీనియర్‌ను.. ఆ మంత్రుల వద్దకు వెళ్లకండి" - పదవి లేకపోయినా అన్ని చేస్తానన్న భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Muttamsetti Srinivasa Rao: "నాకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తర్వాత నేనే సీనియర్‌ని. ఎలాంటి పనులున్నా చేయగలను. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తా. కాబట్టి పక్క జిల్లాల మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు" ఇవి ఇటీవల మంత్రి వర్గ పునర్​వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయిన ఎమ్మెల్యే చెప్పిన మాటలు. ఇంతకీ ఆయనెవరంటే..?

Muttamsetti Srinivasa Rao
భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
author img

By

Published : May 21, 2022, 9:46 AM IST

Muttamsetti Srinivasa Rao: మంత్రి పదవి పోయిన తనను.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారో ఏమో గానీ.. అందరూ తనను పట్టించుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి. పదవి లేకపోయినా పనులు చేస్తానని, ఇతర మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, అవసరమైతే సీఎంతో మాట్లాడుతానని కూడా అన్నారు!

ఆయనే.. మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు. తనకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తర్వాత తానే సీనియర్‌ని కూడా చెప్పారు. ఎలాంటి పనులున్నా చేయగలనన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారు. అందువల్ల ఎవరూ పక్క జిల్లాల మంత్రుల వద్దకు వెళ్లొద్దని తన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం విశాఖ జిల్లా భీమిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చెప్పడంతో ఆయన స్పందించి ఇలా అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.