'భారత్ మాతాకీ జై! మాతరం మాతరం వందేమాతరం!' అని నినాదాలు చేస్తూ.. భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు విశాఖ సాగరతీరంలో ర్యాలీ నిర్వహించారు. పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు సమర్పించారు. వాలంటైన్స్ డే సందర్భంగా యువత విదేశీ పోకడలకు ఆకర్షితులు కాకుండా.. దేశభక్తిని పెంపొందించుకోవాలని యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగర భాజపా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం... ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం